అంతరించిపోతున్న దేశవాళి ఆవులు పుంగనూరు ఆవులను అభివృద్ధి చేయాలని సంకల్పంతో ప్రస్తుత కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన రెడ్డి సత్తిబాబు అనే రైతు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన వద్ద 30 వరకు పుంగనూరు జాతికి చెందిన ఆవులు గిత్తలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గిత్తల ద్వారా జాతి ఉత్పత్తి చేయడానికి ఈయన చేస్తున్న కృషి అభినందనీయం. సత్తిబాబు సేవలను గుర్తించిన పలు సంస్థలు పలు అవార్డులు రివార్డులు లభించాయి. ఇటీవల జాతీయస్థాయిలో ద్వారకా తిరుమల లో జరిగిన ఆవుల అందాల పోటీలు రెడ్డి సత్తిబాబుకు చెందిన రెండు పొంగునూరుఆవులకు జాతీయ స్థాయి ప్రథమ ద్వితీయ బహుమతులు లభించాయి. పుంగనూరు ఆవులు జాతిని వృద్ధిచేస్తున్న రెడ్డి సత్తిబాబును కోనసీమ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఏ జైపాల్ ఘనంగా సత్కరించారు. ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.
Reddi Sattibabu punganuru cow farmer got first and second prizes watch video
Video description- Category
- Music
Commenting disabled.